BannerFans.com

We are a Web Marketing company. Search4ap integrates all services and businesses in Andhra Pradesh,under one umbrella www.search4ap.com,to make residents enjoying better choices while looking for a specific or product in the market.

OUR AIM To promote availability of information in all aspects , to residents of Andhra pradesh.

Resources: HYDERABAD , VIZAG , VIJAYAWADA.

Business Information of Andhra Pradesh*AP Business Directory*Trade services of AP*AP MFRS and Suppliers*AP shop keepers*About AP dealers*AP online Business*AP online directory*AP Trade Directory*AP Trade information*Industries of AP*Commrcial Establishments in AP*Business Information of AP*Departmental stores in AP*Companies in AP*AP Business details*Services of AP*AP services directory* About AP*AP Schools* AP Hospitals *AP Hotels
BREAKING NEWS---- BUMPER STICKER---- Breakfast pancakes----
Showing posts with label MAZAGINE. Show all posts
Showing posts with label MAZAGINE. Show all posts

TELUGU MAGAZINE

0 comments


                    T E L U G U      M O N T H L Y


.....................................................................
                T E L U G U      M O N T H L Y                    
                                 INDEX
ఆరోగ్యం

ముఖాముఖీ 
                           

బాలవికాసం

వైద్యం


చదువు


నజరానా


గృహశోభ

చట్టం

ఫ్యాషన్















































బాలవికాసం ( CHILD)

0 comments

                వివిధ   వయసుల్లో  పసిపాపల  స్పందనలు 
పరిసరాలకు  స్పందించడం  పిల్లలకు  పుట్టికతోనేరాదు.  జ్ఞానఇంద్రియాలు  అభివృద్ధి  అవుతున్న , కొద్ది  వోకొక్క  వయసుకి  వోకో  ప్రతిస్పందనను  కనపరుస్తారు, అలవరచుకుంటారు. పాపయాల ప్రతిస్పందనలు  ఏ  వయసులో  ఎలా ఉంటాయో  ఒకసారి  చుడండి .  
  * వస్తువు  వెంటే  చూపును తిప్పడం 
         ముందస్తుగా                          7 వారాలు 
         సాదారణంగా                          2  నెలలు 
          అలస్యం                                 4  నెలలు 

   * రెండు హాండ్స్ పట్టుకోవడం 
      ముందస్తుగా                          5 వారాలు 
      సాదారణంగా                          2 నెలలు 
      అలస్యం                                 ౩.5 నెలలు 
 
   *  వస్తువు వైపు  హాండ్స్  చాపడం 
         ముందస్తుగా                        2 .5  నెలలు 
         సాదారణంగా                          3  నెలలు 
          అలస్యం                                 5  నెలలు 


    * వస్తువుల్ని  హాండ్స్ లోకి తీసుకోడం 
         ముందస్తుగా                          5 నెలలు
         సాదారణంగా                          6   నెలలు 
          అలస్యం                                 7 .5  నెలలు 

    








































EDITORIAL

0 comments























                                             ఆశలు నిజమౌతివి 
ఆశలు    నెరవేరాలంటే  ముందు  మనం ఆశ పడాలి .కలలు నిజమవ్వాలంటే ముందు కలగనాలి .ఎవరిగురించో  జీవించడం మాని మనకొరకు మనం జీవించాలి .మనల్ని శాసిస్తూ  ఇలా ఉండు ,అలా ఉండు ,ఇలా చెయి ,ఆలా చెయి, అని చేప్పే శక్తులు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి . ఆ శక్తులు మన మంచినే  కోరి  చెప్తూ ఉంటాయి కుడా .కాని జీవించడానికి  ఒక  రహదారి వేసి ఇదే మార్గమని ఖచ్చితంగా  చప్పలేము .వారి వారి  జీవిత  టార్గెట్  ను అనుసరించి  తమదైన మార్గాన్ని వేసుకొని ఎవరకి వారు  ముందుకి  పోవాల్సిందే .

                              అలాగని  మనకు నచ్చినట్టు జీవించాలి అనే  కాన్సెప్ట్ తో  అడ్డంగా  నడిచి  జీవితం  పాడు  చేసుకోకూడదు . అందుకే  మనల్ని శాసించే  సమాజం , పెద్దలు , తత్వవేత్తలు ,రచయితలు ,మీడియా , అందరి మాటలు ,సందేశాలు ఆలకించాలి .మన ఆలోచనల్ని  వారి  ఆలోచనలతో  బెరిజు  చేసుకొని  బ్యాలన్సుడ్  గా  విశ్లేషేంచాలి .
                              అప్పుడు  మనం  నిర్ణయం  తీసుకోవాలి . మీదైన  మార్గం  మీరే  వేసుకొని  ముందుకు  సాగాలి .మార్గమద్యం లో   నిరాశా నిస్పృహ లు  వెంటాడుతూ ఉంటాయి . అలసట  కమ్ముకొస్తుంది . ధైర్యం సన్నగిల్లుతుంది .అలసత్వం  ఆవహిస్తుంది . ఈ క్రూర మృగాలు  బారిన  పడకుండా  ఆత్మవిశ్వాసం  ఆనే  ఆయుధాన్ని తీసుకుపొండి .
                              
                            జీవితంలో  ధుక్కం ,వోటమినీ  ప్రాలద్రోలి  ఆనంద సామ్రాజాన్ని  స్తాపిద్దాం .యుద్ధం  తప్పనసరి .యుద్ధం అనువ్యార్యం  ఐనప్పుడు విజయం  కొరకే  పోరాడాలి . విజయం  తద్యం .
                                                                                                                        మీ 
                                                                                                             search4ap.com


గృహవైద్యం

0 comments



HEALTH

0 comments

ఆహారమే ఆరోగ్యానికి తొలిమెట్టు
































ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటూ దానికి తగినంత శారీరక శ్రమ చేయకపోతే ఆరోగ్యంపై చాలా శీఘ్రంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడ్డ తర్వాత ఆరోగ్యసమస్యలు అధికమవుతాయి. ఈ వయసులో అధిక రక్తపోటు, డయాబెటిస్, శ్వాసవ్యవస్థ ఇన్ఫెక్షన్, అధిక కొలెస్టరాల్, క్యాన్సర్, ఆస్టియో పొరోసిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

టీనేజ్‌లో... చదువు, కెరీర్ విషయాలలోతరచు తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతుంటారు. 40-50 మధ్య వయసు ఉన్నవారు, అంతకు పైబడిన వారిపై కుటుంబావసరాల రీత్యా ఆర్థిక పరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. 60 సంవత్సరాలు దగ్గరపడే సమయంలో బాధ్యతలు కొంత తగ్గుతాయి. కాని 40 ఏళ్ల వయసులో ఆరోగ్యానికి జరిగిన నష్టాన్ని తిరిగి సాధారణ స్థాయికి చేర్చడం కష్టమవుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు: నలభై ఏళ్లు పైబడిన వారు వారి ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు ఆహారపుటలవాట్లలోనూ, జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవడం కన్న మేలైన మార్గం లేదు. దీనివల్ల వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. అన్ని రకాల ధాన్యాలు, పప్పుదినుసులు, తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. కొవ్వు ఎక్కువగా లేని మాంసం, ప్రొటీన్లు సమృద్ధిగా లభించే ఆహారపదార్థాలుతీసుకోవాలి. నూనె పదార్థాలను పూర్తిగా త గ్గించాలి. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లను నెమ్మదిగా తగ్గించాలి.

డైటరీ సప్లిమెంట్స్: ఈ వేగవంతమైన జీవనంలో పోషక పదార్థాల సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారం నుంచే మనకు అవసరమయ్యే పోషకాలు అన్నీ లభ్యం కాకపోవచ్చు. అందువల్ల ముఖ్యమైన అవయవాల పనితీరు మందగిస్తుంది. దీనివల్ల ఉన్న వయస్సు కన్న అధికంగా కనిపిస్తారు. కాబట్టి డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరం.

వ్యాయామంతో ఉల్లాసం: రోజూ చేసే వ్యాయామం, శారీరక శ్రమ వల్ల అదనంగా ఉన్న కేలరీలు ఖర్చయి, బరువు పెరగకుండా నిరోధిస్తుంది.

వైద్యపరీక్షలు అవసరం: ఒక వయసు దాటాక రక్తంలో చక్కెరశాతం, కొలెస్టరాల్ స్థాయి, అధికరక్తపోటును క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. దాంతో బయటకు తెలియ కుండా శరీరం లోపల వచ్చిన మార్పులను తేలిగ్గా గుర్తించగలుగుతాం. ఫలితంగా సరైన సమయం లో చికిత్స తీసుకోవడం సాధ్యపడుతుంది. అప్పుడు సుదీర్ఘకాలం ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.


BEAUTY

0 comments

నా వయసు 20. ముఖం నిండా చిన్న చిన్న గుంటలు ఉన్నాయి. ఈమధ్య ముఖంపై పొక్కులు కూడా వచ్చి చీము పట్టి మచ్చలుగా ఏర్పడుతున్నాయి. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.




యుక్తవయస్కుల్లో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే పొక్కులను ఆయుర్వేద పరిభాషలో తారుణ్యపిడిక లేదా యవాన పిటికలు అంటారు. దీన్నే వ్యావహారిక భాషలో పింపుల్స్ అంటారు. వయసు గడుస్తున్నకొద్దీ ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే అసహనంతో వాటిని గిల్లడం వంటివి చేస్తే ముఖం మీద గుంటలు పడతాయి. మీరు ఆ పొక్కులున్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. అందుకే యుక్తవయసులో ఇలా పింపుల్స్ వస్తున్నవారు తరచూ వేడినీటితోనూ, సున్నిపిండితోనూ ముఖం కడుక్కుని శుభ్రంగా ఉంచాలి. లేదంటే దుమ్ముధూళి సోకి ఇన్ఫెక్షన్ వచ్చి గుంటలు ఏర్పడే ప్రమాదం ఉంది. రోజూ ఆహారం తిన్న తర్వాత ఆరోగ్యవర్ధని మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోండి. 
గంధకరసాయన మాత్రలు కూడా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి. అయితే ఇవి ఖాళీకడుపున తీసుకుని, పాలు తాగాలి. ఖదిరారిష్ట, శారిబాద్యాసవ ద్రావకాలు రెండేసి చెంచాలు ఒక గ్లాసులో తీసుకుని వాటికి నాలుగు చెంచాల నీళ్లు కలిపి రోజూ ఆహారం తిన్న తర్వాత రెండు పుటలా తాగాలి. ఇక పైపూత మందుగా కుంకుమాదిలేప (ఆయింట్‌మెంట్) రోజుకు రెండు మూడుసార్లు రాసుకోండి.

మీరు ఆహారంలో వెన్న, నెయ్యి వంటి జిడ్డుగా ఉండే పదార్థాలను వాడకండి. బొప్పాయి, క్యారట్, మునగకాడ వంటి విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి.
--------------------------------------------------------------------------------------------------------------
జిడ్డు చర్మం సమస్య ఉన్న వారు...
టొమాటో, బంగాళదుంపలను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమానికి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని 5
నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోయి మృదువుగా తయారవుతుంది.
                        -----------------------------------------------
  **           టీ స్పూన్ పచ్చిపాలలో అయిదారు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ముంచి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గి ముఖం పొడిబారకుండా ఉండి చర్మం నిగనిగలాడుతుంది. 
                         -------------------------------------------------------------
మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే మొదటగా వేపాకులను మెత్తని పేస్ట్ చేసి అందులో టీ స్పూన్ బాదం నూనె, చిటికెడు పసుపు, చిటికెడు చందనం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట పలుచని పొరగా పెట్టుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తేడా కనిపిస్తుంది. 
                           -----------------------------------------------------------
అర టీ స్పూన్ కొబ్బరినీళ్లు, అదే మోతాదులో పైనాపిల్ రసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి.
అర టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ కీరా జ్యూస్ సమపాళ్లలో తీసుకుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.
           వెనిగర్, రోజ్‌వాటర్ సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి.
నాలుగు టీ స్పూన్ల తాజా పెరుగులో రెండు టీ స్పూన్ల టొమాటో రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి.
కోడిగుడ్డులోని పచ్చసొనలో, కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొంచెం నిమ్మరసం కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 10 నిమిషాల తరవాత కడిగేయాలి.
వారంలో రెండుసార్లు ఈ విధంగా చేసినట్లయితే నిగనిగలాడే చర్మ సౌందర్యం మీ సొంతమవుతుంది. 
                     -----------------------------------------------------
మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోపాటు ముడతలు పోతాయి.

ఇంటి చిట్కా
కరివేపాకు కాని కొత్తిమీర కాని ఎండినప్పుడు దానిని పారవేయకుండా కొద్దిగా నలిపి కూరల్లో వేసుకుంటే పచ్చి కరివేపాకు వేసుకున్నప్పటిలాగే రుచిగా ఉంటుంది.