ఆహారమే ఆరోగ్యానికి తొలిమెట్టు


ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటూ దానికి తగినంత శారీరక శ్రమ చేయకపోతే ఆరోగ్యంపై చాలా శీఘ్రంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడ్డ తర్వాత ఆరోగ్యసమస్యలు అధికమవుతాయి. ఈ వయసులో అధిక రక్తపోటు, డయాబెటిస్, శ్వాసవ్యవస్థ ఇన్ఫెక్షన్, అధిక కొలెస్టరాల్, క్యాన్సర్, ఆస్టియో పొరోసిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
టీనేజ్‌లో... చదువు, కెరీర్ విషయాలలోతరచు తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతుంటారు. 40-50 మధ్య వయసు ఉన్నవారు, అంతకు పైబడిన వారిపై కుటుంబావసరాల రీత్యా ఆర్థిక పరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. 60 సంవత్సరాలు దగ్గరపడే సమయంలో బాధ్యతలు కొంత తగ్గుతాయి. కాని 40 ఏళ్ల వయసులో ఆరోగ్యానికి జరిగిన నష్టాన్ని తిరిగి సాధారణ స్థాయికి చేర్చడం కష్టమవుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు: నలభై ఏళ్లు పైబడిన వారు వారి ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు ఆహారపుటలవాట్లలోనూ, జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవడం కన్న మేలైన మార్గం లేదు. దీనివల్ల వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. అన్ని రకాల ధాన్యాలు, పప్పుదినుసులు, తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. కొవ్వు ఎక్కువగా లేని మాంసం, ప్రొటీన్లు సమృద్ధిగా లభించే ఆహారపదార్థాలుతీసుకోవాలి. నూనె పదార్థాలను పూర్తిగా త గ్గించాలి. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లను నెమ్మదిగా తగ్గించాలి.
డైటరీ సప్లిమెంట్స్: ఈ వేగవంతమైన జీవనంలో పోషక పదార్థాల సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారం నుంచే మనకు అవసరమయ్యే పోషకాలు అన్నీ లభ్యం కాకపోవచ్చు. అందువల్ల ముఖ్యమైన అవయవాల పనితీరు మందగిస్తుంది. దీనివల్ల ఉన్న వయస్సు కన్న అధికంగా కనిపిస్తారు. కాబట్టి డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరం.
వ్యాయామంతో ఉల్లాసం: రోజూ చేసే వ్యాయామం, శారీరక శ్రమ వల్ల అదనంగా ఉన్న కేలరీలు ఖర్చయి, బరువు పెరగకుండా నిరోధిస్తుంది.
వైద్యపరీక్షలు అవసరం: ఒక వయసు దాటాక రక్తంలో చక్కెరశాతం, కొలెస్టరాల్ స్థాయి, అధికరక్తపోటును క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. దాంతో బయటకు తెలియ కుండా శరీరం లోపల వచ్చిన మార్పులను తేలిగ్గా గుర్తించగలుగుతాం. ఫలితంగా సరైన సమయం లో చికిత్స తీసుకోవడం సాధ్యపడుతుంది. అప్పుడు సుదీర్ఘకాలం ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.
You Might Also Like :
0 comments:
Post a Comment