Monday, March 17, 2025

BannerFans.com
BREAKING NEWS---- BUMPER STICKER---- Breakfast pancakes----

BEAUTY


10:43 AM |

నా వయసు 20. ముఖం నిండా చిన్న చిన్న గుంటలు ఉన్నాయి. ఈమధ్య ముఖంపై పొక్కులు కూడా వచ్చి చీము పట్టి మచ్చలుగా ఏర్పడుతున్నాయి. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.




యుక్తవయస్కుల్లో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే పొక్కులను ఆయుర్వేద పరిభాషలో తారుణ్యపిడిక లేదా యవాన పిటికలు అంటారు. దీన్నే వ్యావహారిక భాషలో పింపుల్స్ అంటారు. వయసు గడుస్తున్నకొద్దీ ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే అసహనంతో వాటిని గిల్లడం వంటివి చేస్తే ముఖం మీద గుంటలు పడతాయి. మీరు ఆ పొక్కులున్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. అందుకే యుక్తవయసులో ఇలా పింపుల్స్ వస్తున్నవారు తరచూ వేడినీటితోనూ, సున్నిపిండితోనూ ముఖం కడుక్కుని శుభ్రంగా ఉంచాలి. లేదంటే దుమ్ముధూళి సోకి ఇన్ఫెక్షన్ వచ్చి గుంటలు ఏర్పడే ప్రమాదం ఉంది. రోజూ ఆహారం తిన్న తర్వాత ఆరోగ్యవర్ధని మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోండి. 
గంధకరసాయన మాత్రలు కూడా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి. అయితే ఇవి ఖాళీకడుపున తీసుకుని, పాలు తాగాలి. ఖదిరారిష్ట, శారిబాద్యాసవ ద్రావకాలు రెండేసి చెంచాలు ఒక గ్లాసులో తీసుకుని వాటికి నాలుగు చెంచాల నీళ్లు కలిపి రోజూ ఆహారం తిన్న తర్వాత రెండు పుటలా తాగాలి. ఇక పైపూత మందుగా కుంకుమాదిలేప (ఆయింట్‌మెంట్) రోజుకు రెండు మూడుసార్లు రాసుకోండి.

మీరు ఆహారంలో వెన్న, నెయ్యి వంటి జిడ్డుగా ఉండే పదార్థాలను వాడకండి. బొప్పాయి, క్యారట్, మునగకాడ వంటి విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి.
--------------------------------------------------------------------------------------------------------------
జిడ్డు చర్మం సమస్య ఉన్న వారు...
టొమాటో, బంగాళదుంపలను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమానికి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని 5
నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోయి మృదువుగా తయారవుతుంది.
                        -----------------------------------------------
  **           టీ స్పూన్ పచ్చిపాలలో అయిదారు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ముంచి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గి ముఖం పొడిబారకుండా ఉండి చర్మం నిగనిగలాడుతుంది. 
                         -------------------------------------------------------------
మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే మొదటగా వేపాకులను మెత్తని పేస్ట్ చేసి అందులో టీ స్పూన్ బాదం నూనె, చిటికెడు పసుపు, చిటికెడు చందనం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట పలుచని పొరగా పెట్టుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తేడా కనిపిస్తుంది. 
                           -----------------------------------------------------------
అర టీ స్పూన్ కొబ్బరినీళ్లు, అదే మోతాదులో పైనాపిల్ రసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి.
అర టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ కీరా జ్యూస్ సమపాళ్లలో తీసుకుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.
           వెనిగర్, రోజ్‌వాటర్ సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి.
నాలుగు టీ స్పూన్ల తాజా పెరుగులో రెండు టీ స్పూన్ల టొమాటో రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి.
కోడిగుడ్డులోని పచ్చసొనలో, కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొంచెం నిమ్మరసం కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 10 నిమిషాల తరవాత కడిగేయాలి.
వారంలో రెండుసార్లు ఈ విధంగా చేసినట్లయితే నిగనిగలాడే చర్మ సౌందర్యం మీ సొంతమవుతుంది. 
                     -----------------------------------------------------
మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోపాటు ముడతలు పోతాయి.

ఇంటి చిట్కా
కరివేపాకు కాని కొత్తిమీర కాని ఎండినప్పుడు దానిని పారవేయకుండా కొద్దిగా నలిపి కూరల్లో వేసుకుంటే పచ్చి కరివేపాకు వేసుకున్నప్పటిలాగే రుచిగా ఉంటుంది. 


You Might Also Like :

Related Posts



0 comments:

Post a Comment