కైమా కబాబ్స్
కావలసిన పదార్థాలు :
కైమా - ¼ కిలోఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 2
అల్లం, వెల్లుల్లి - కొద్దిగా
వేయించిన సెనగపప్పు - 1 స్పూన్
గసగసాలు - 1 స్పూన్
లవంగాలు - 3
యాలకులు - 3
దాల్చిన చెక్క 2
కారం - 1 స్పూన్
ఉప్పు - తగినంత
కోడిగుడ్డు - 1
గట్టిపెరుగు - అరకప్పు
నూనె - 1 కప్పు
తయారు చేయు విధానం:
నాన్ వెజ్ ప్రియులకు కీమా మరింత ఇష్టం. కీమా రెసిపీలకు లోటు లేదు. కీమా కబాబ్స్, కీమా బాల్స్, కీమా కర్రీస్, కీమా కట్లెట్ లాంటి కీమా వెరైటీలు అనేకం. కీమా కబాబ్స్ రెసిపీ కోసం ముందుగా ఒక ఉల్లిపాయ ముక్కలు కోయాలి. ఈ ముక్కల్లో ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పేస్ట్ చేసి అన్నీ కలిపి పావుగ్లాసు నీరు పోసి ఉడికించి, గసగసాలు, వేయించిన సెనగపప్పు, ఉడికించిన కైమాను మెత్తగా గ్రైండ్ చేసి కోడిగుడ్డు సొన వేసి కలపాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయించి పెరుగులో కలపాలి. నూరిన కైమాను చిన్న చిన్న బిళ్ళలుగా చేసి వత్తి పెరుగు మిశ్రమం పెట్టి రెండో బిళ్ళతో పైన నొక్కాలి. బాణలిలో నూనె వేడిచేసి కబాబ్స్ ను వేయించి తీయాలి.You Might Also Like :
0 comments:
Post a Comment