కైమా కుర్మా
కావలసిన పదార్థాలు :
కైమా - ½ కిలో
టొమేటోలు - 3
ఉల్లిపాయలు - 3
అల్లం - చిన్నముక్క
పచ్చిమిర్చి - 10
వెల్లుల్లిపాయ 1
ధనియాలు - 1స్పూన్
సోంపు - ½ స్పూన్
గసగసాలు - 2 స్పూన్స్
లవంగాలు - 6
దాల్చిన చెక్క - 6
యాలకులు - 6
జీడిపప్పు - 12
కొబ్బరి - 1 చెక్క
రిఫైండ్ ఆయిల్ - 1 కప్పు
కొత్తిమీర - 1 కట్ట
బిరంజి ఆకు – కొద్దిగా
తయారు చేసే పద్ధతి :
కైమా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, టొమేటోలు ముక్కలు తరగాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద నూరాలి. ధనియాలు, సోంపు, 3లవంగాలు, 3 యాలకులు, 3 దాల్చిన చెక్కలు ముద్దగా నూరాలి. గసగసాలు, కొబ్బరి, 6 జీడిపప్పులు ముద్దగా నూరాలి. బిరంజి ఆకు, జీడిపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేయించి ఉల్లిపాయలు వేగాక కైమా, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి సన్నసెగలో ఇగరబెట్టాలి. కారం, మసాలా ముద్దవేసి కొద్దిసేపు వేయించి, టొమేటో ముక్కలు, ఉప్పువేసి మగ్గిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు ముద్దవేసి దగ్గరపడిన తర్వాత దించి, కొత్తిమీర జల్లితే సరిపోతుంది.
You Might Also Like :
0 comments:
Post a Comment