. మటన్ కీమా కట్లెట్స్
కావలసిన పదార్థాలు :
కీమా - ½ కిలోనెయ్యి - ¼ కిలో
ఉల్లిపాయ - 1
కొత్తిమీర - కొద్దిగా
బ్రెడ్ స్లైసెస్ - 2
ఎండిన రొట్టెముక్కల పొడి - 4 స్పూన్స్
గుడ్డు - 1
వెల్లుల్లి రెబ్బలు - 2
పచ్చిమిర్చి - 8
ఉప్పు - తగినంత
తయారు చేసే పద్ధతి :
మటన్ రెసిపీస్ లో కీమా కర్రీస్, కీమా ఫ్రై, కీమా కట్లెట్స్ ఇలా ఎన్నో రకాలున్నాయి. మటన్ కీమా కట్లెట్స్ రెసిపీ గురించి తెలుసుకుందాం. ముందుగా కీమాను కొద్దిసేపు నీటిలో నానబెట్టి, నీళ్ళు లేకుండా పిండి వుంచాలి. గుడ్డు నురుగు వచ్చేలా గిలక్కొట్టి ఉంచాలి. కీమాలో ఉల్లిపాయ, వెల్లుల్లి, 1 ½ కప్పుల నీరుపోసి, నీరు ఇగిరిపోయేవరకు ఉడికించాలి. తర్వాత తడిపిన బ్రెడ్, పచ్చిమిర్చి ముక్కలు, సాస్, కొత్తిమీర కలపాలి.పై మిశ్రమాన్ని అండాకృతిలో చేసి వుంచాలి. కోడిగుడ్డు సొనకి ½ కప్పు నీరు కలిపి అందులో కట్ లెట్స్ ని ముంచి తీసి రొట్టెముక్కల పొడిలో రెండు వైపులా అద్దాలి. తర్వాత నేతిలో వేయించి తీస్తే సరి. ఈ మటన్ కీమా కట్లెట్స్ యమా రుచి, మహా బలం.
You Might Also Like :
0 comments:
Post a Comment