మటన్ చాట్
కావలసిన పదార్థాలు :
పొట్టేలు తొడలు - 2 (1కిలో)అల్లం, వెల్లుల్లి - 10గ్రా
కారం - 15గ్రా
వెనిగర్ - 20మి.లీ
టొమేటోలు - 3
ఉల్లిపాయలు - 100 గ్రా
కీరా దోసకాయ ముక్కలు - 50గ్రా
నిమ్మకాయలు - 2
పచ్చిబొప్పాయి - చిన్న ముక్క
రమ్ - 120 మి.లీ
ఉప్పు - తగినంత
మటన్ స్టాక్ - 2లీటర్లు
గరం మసాలా - 5 గ్రా
నూనె - 50 మి.లీ
చాట్ మసాలా - 2స్పూన్స్
తయారు చేయు విధానం:
మటన్ కర్రీ రెసిపీలు వందల రకాలున్నాయి. టేస్టీ మటన్ కర్రీస్ కు మనదేశం పెట్టింది పేరు. ఇండియన్ మటన్ రెసిపీల్లో ఆలూ మటన్, తందూరీ మటన్, మటన్ ఫ్రై, మటన్ చాట్ - ఇలా అసంఖ్యాకమైన ఇండియన్ నాన్ వెజ్ రెసిపీలు ఉన్నాయి. ఇప్పుడు మటన్ చాట్ రెసిపీ తెలుసుకుందాం. మటన్ చాట్ కోసం పొట్టేలు తొడలు శుభ్రం చేసి బొప్పాయి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె, కారం, వెనిగర్, రమ్, ఉప్పు పట్టించి 3గంటలు నానబెట్టాలి. బేకింగ్ ట్రేకి నూనె రాసి మాంసం వుంచి ముప్పాతిక వంతు మునిగేలా స్టాక్ పొయ్యాలి. 90 నిమిషాలు బేక్ చేయాలి. అవసరమైతే స్టాక్ కలుపుతూ ఎర్రగా రోస్ట్ చెయ్యాలి. తర్వాత దించి ఇనుప చువ్వకు గుచ్చి బొగ్గుల సెగమీద కాల్చాలి. చివర్లో చాట్ మసాలా, ఉల్లిముక్కలు, టొమేటో ముక్కలు, కీరా, నిమ్మకాయ ముక్కలతో అలంకరిస్తే మటన్ చాట్ కలర్ఫుల్ గా ఉంటుంది. మటన్ చాట్ ఒకసారి చేసి చూడండి, మరో రెసిపీ గురించి మళ్ళీ తెలుసుకుందాంYou Might Also Like :
0 comments:
Post a Comment